దిలీపన్‌, అంజలిల కాంబినేషన్‌లో...

- September 11, 2016 , by Maagulf
దిలీపన్‌, అంజలిల కాంబినేషన్‌లో...

 దర్శకుడు ఏ.ఆర్‌ మురగదాస్‌ సోదరుడు దిలీపన్‌, అంజలిల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'గోలీసోడా'.తమిళంలో ఏ.ఆర్‌ మురగదాస్‌ నిర్మాతగా పి.కిన్‌స్లిన్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'వత్తికుచ్చి'. తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే విడదుల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇందులో అంజలిది విభిన్న పాత్రని ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని నిర్మాత వెంకటరావ్‌ మీడియా ద్వారా వెల్లడించారు. జిబ్రాన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.ఈ చిత్రంలో సంపత్‌, జయప్రకాశ్‌, జగన్‌, సతీశ్‌, అఖిల్‌కుమార్‌, రాజశ్రీ తదితరులు నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com