పెదాలు నల్లగా ఉంటే..
- August 05, 2015
అమ్మాయిల ముఖంలో పెదాలు అందానికి ఒక ఆకర్షణ. పెదాలు గులాబీ రంగులో ఉంటే అందం మరింత ఎక్కువవుతుంది. వీటి కోసం రకరకాల లిప్ స్టిక్స్, లిప్ గ్లాసెస్ వాడుతూ ఉంటారు. అవి అందరికీ పడవు. అందుకే సహజంగానే పెదాల రక్షణకు, అందానికి కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అనాస, బొప్పాయి ముక్కలను మెత్తగా గుజ్జులా చేసి, దానిని పెదాలకు పట్టించి 20 నిముషాల తరువాత కడిగేస్తే నల్లగా ఉన్న పెదాలు గులాబీ రంగులోకి మారతాయి. గులాబీ రేకులను మెత్తగా చేసి దానికి చెంచా తేనె కలిపి పెదాలకు రాసి పావుగంట తర్వాత కడిగేస్తే పెదాలు లేత గులాబీ రంగులోకి రావడమే కాకుండా మృదువుగా తయారవుతాయి. అప్పుడప్పుడూ చిన్న ఐస్ ముక్కను తీసుకుని పెదాల మీద రుద్దితే రక్త ప్రసరణ బాగా జరిగి, పెదాల మీద పగుళ్లు లేకుండా మృదువుగా మారతాయి. పెదాలు సున్నితమైనవి గనుక కెమికల్స్‌తో తయారయ్యే బ్యూటీ ప్రోడక్ట్స్‌కి దూరంగా ఉండటమే మేలు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- సోహార్‌లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!







