సిరియాలో వైమానిక దాడులు, 100 పైగా మృతి
- September 11, 2016
సిరియాలో బాంబుల వర్షం కురిసింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే జరిగిన ఈ దారుణ సంఘటనల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈద్ అల్ అధా సందర్భంగా సోమవారం నుంచి 10 రోజుల పాటు కాల్పులు జరపరాదని అమెరికా, రష్యా శనివారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే తిరుగుబాటుదారుల ప్రాబల్యంలో ఉన్న ఇడ్లిబ్, అలెప్పో నగరాలపై వైమానిక దాడులు జరిగాయని ఉద్యమకారులు చెప్తున్నారు. ఈ దాడుల్లో ఇడ్లిబ్‌లో దాదాపు 60 మంది, అలెప్పోలో సుమారు 45 మంది మరణించారని తెలిపారు. ఐసిస్, అల్ ఖైదాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు అమెరికా, రష్యా సైనిక భాగస్వామ్యం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. సిరియాలోని జీహాదీ ఉగ్రవాదులపై సమన్వయంతో వైమానిక దాడులు చేయడానికి నిర్ణయించుకున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దళాలపై కొత్త పరిమితులు విధించాయి. అమెరికా హోం శాఖ కార్యదర్శి జాన్ కెర్రీ మాట్లాడుతూ అమెరికా, రష్యా ఓ ప్రణాళికను ప్రకటిస్తున్నాయన్నారు. సిరియాలో హింసను తగ్గించేందుకు, శాంతి, రాజకీయ మార్పుకోసం ఈ ప్రణాళిక దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







