మ్యాంగో మటన్
- September 11, 2016
కావలసిన పదార్థాలు: మామిడికాయలు (పునాస మామిడి అంటారు, ఈ సీజన్లో మార్కెట్లో దొరుకుతాయి) -2, బోన్లెస్ మటన్ - అరకేజి, కారం - 2 టీ స్పూన్లు, ధనియాలపొడి - 2 టీ స్పూన్లు, మిరయాలపొడి - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 4, నూనె - అరకప్పు, మసాలాపొడి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: మామిడికాయల్ని మెత్తగా ఉడికించి, తొక్క, టెంక వేరుచేసి గుజ్జుని గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. మటన్, అల్లం వెల్లుల్లి కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించి తర్వాత ఆ ముక్కలకి పసుపు, కారం, ధనియాలపొడి, మిరియాలపొడి, ఉప్పు పట్టించి పది నిమిషాలు ఉంచాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ, మిర్చిముక్కల్ని దోరగా వేగించి మటన్ ముక్కల్ని వేసి మరో ఐదునిమిషలు మగ్గనిచ్చి మామిడి గుజ్జుని కలపాలి. అవసరమనిపిస్తే కొంత నీటిని కలుపుకోవచ్చు. కూర చిక్కబడ్డాక మసాలా పొడి చల్లుకుని, కొత్తిమీరతో అలంకరించుకోవాలి.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







