స్కూల్ సమీపంలో పేలిన గ్యాస్ సిలెండర్లు
- September 11, 2016
మనామా: దుండగులు రెండు గ్యాస్ సిలెండర్లను బిలాద్ అల్ కదీమ్ గ్రామంలో పేల్చిన ఘటన తీవ్ర భయాందోళనల్ని కలిగించింది. క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలోని ఓ స్కూల్ వద్ద ఈ పేలుళ్ళు సంభవించాయి. అయితే ఈ పేలుళ్ళలో ఎవరూ గాయపడలేదు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈ వివరాల్ని ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. స్కూల్ గోడను ఈ పేలుళ్ళు ధ్వంసం చేశాయనీ, అదృస్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్కూల్ భద్రతా సిబ్బంది తక్షణం స్పందించి, మంటల్ని ఆర్పి వేశారని, తీవ్రవాదుల ఘాతుకాన్ని ఖండిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొద్ది రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ దాడులు అత్యంత హేయమని మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







