శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌కి నాగార్జున శుభాకాంక్షలు...

- September 12, 2016 , by Maagulf
శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌కి నాగార్జున శుభాకాంక్షలు...

తన ప్రియమైన స్నేహితుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఆశిస్తున్నట్లు అక్కినేని నాగార్జున ట్వీట్‌ చేశారు. రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న 'నిర్మలా కాన్వెంట్‌' చిత్రాన్ని ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రం పోస్టర్‌ను షేర్‌ చేశారు. ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తూ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. జి.ఎస్‌. కోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రేయా శర్మ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.ఇటీవల ఈ చిత్రం ఆడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com