24 నుంచి ప్రారంభం కానున్న'సెలబ్రిటీ బ్యాట్మింటన్ లీగ్'
- September 12, 2016
సెలబ్రిటీ బ్యాట్మింటన్ లీగ్‌లో తలపడనున్న టాలీవుడ్ థండర్స్ ప్రాంచైజీని ప్రముఖ కథానాయకుడు నాగచైతన్య ఆవిష్కరించారు. సోమవారం సాయంత్రం మాదాపూర్‌లోని ఆవాస హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీనటులు తరుణ్, నిఖిల్, సుధీర్‌బాబుతో పాటు, సినీ తారలు మంచులక్ష్మి, ఛార్మి, సంజన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒలంపిక్స్‌లో సింధు విజయం తర్వాత బ్యాడ్మింటన్ క్రీడకు ఆదరణ పెరిగిందని నాగచైతన్య చెప్పారు. ఈ లీగ్ విజయవంతం కావాలని ఆకాక్షించారు. టాలీవుడ్ థండర్స్ జట్టుకు సుధీర్‌బాబు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా తరుణ్, నిఖిల్, కౌశల్, నవీన్, సత్య, అనిల్, కృష్ణచైతన్య జట్టు సభ్యులుగా ఉన్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







