పారా ఒలింపిక్స్‌లో బహ్రెయిన్‌కి తొలి గోల్డ్ మెడల్
- September 12, 2016
మనామా: 2016 రియో పారా ఒలింపిక్ గేమ్స్‌లో బహ్రెయిన్‌కి తొలి గోల్డ్ మెడల్ అభించింది. షాట్‌పుట్ కాంపిటీషన్లో బహ్రెయిన్‌కి చెందిన ఫాతిమా అబ్దుల్ రజాక్ గోల్డ్ మెడల్ని కైవసం చేసుకుంది. 4.76 మీటర్ల రికార్డ్ సాధించింది ఫాతిమా. భారత్‌కి చెందిన దీపా మాలిక్, గ్రీక్‌కి చెందిన డిమిత్రా కోరకిడాతో తలపడ్డ ఫాతిమా మొదటి స్థానాన్ని గెల్చుకుంది. దీపా మాలిక్‌కి ఈ విభాగంలో రజత పతకం లభించింది. బహ్రెయిన్ డిజేబుల్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ దుయైజ్ అల్ ఖలీఫా, ఈ మెడల్ని కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతోపాటు ్పఐమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, డిప్యూటీ సుప్రీం కమాండర్ అండ్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, తదరులకు అంకితం చేశారు. షేక్ మొహమ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈద్ అల్ అదా సందర్భంగా బహ్రెయిన్ ఈ ఘనతను సాధించడం అద్భుతమని కొనియాడారు. రియో 2016 పారా ఒలింపిక్ గేమ్స్‌లో 170 దేశాలకు చెందిన 4,500 మంది క్రీడాకారులు 32 ఈవెంట్లలో 526 మెడల్స్ కోసం పోటీ పడుతున్నారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







