దర్శకుడు హరీష్ శంకర్ త్వరలో నిర్మాణ సంస్థలో !
- September 13, 2016
టాలీవుడ్ దర్శకులు నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకులలో చాలా మంది నిర్మాతలుగా మారిపోగా, తాజాగా ఈ లిస్ట్ లో మరో యువ దర్శకుడు చేరబోతున్నాడు. గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హరీష్ శంకర్ త్వరలో తన సొంతం నిర్మాణ సంస్థలో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న హరీష్, ఆ సినిమా తరువాత, తన ఫ్రెండ్ కృష్ణతో కలిసి స్వీయ దర్శకత్వంలో ఓ బాలీవుడ్ రీమేక్ ను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు. బాలీవుడ్ మంచి విజయం సాధించిన స్పెషల్ 26 సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు హరీష్.చాలా రోజులుగా ఈ సినిమా రీమేక్ పై ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఇటీవల తమిళ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చినా తెలుగులో మాత్రం మొదలు కాలేదు. మరి హరీష్ శంకర్ అయినా మొదలు పెడతాడో లేదో చూడాలి.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







