గల్ఫ్ బాధిత మహిళల్ని ఆదుకుంటాం--మంత్రి సునీత
- September 13, 2016
ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ అనేక అవస్థలు పడుతున్న మహిళలను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. గల్ఫ్‌లో చిక్కుకుని వివిధ జిల్లాలకు చెందిన మహిళలు ఇబ్బందులు పడుతున్న వైనంపై టీవీ ప్రసారం చేసిన కథనాలపై ఆమె స్పందించారు. పని కోసం తీసుకెళ్లి.. ఇలా చిత్ర హింసలకు గురిచేయడం బాధాకరమన్నారు. ఈ విషయంపై మంత్రి పల్లె రఘునాథరెడ్డితో చర్చించినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి బాధిత మహిళలను స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం చేస్తానన్నారు.
తాజా వార్తలు
- రూ.500 నోట్లు బంద్.. రూమర్స్ పై కేంద్ర ప్రభుత్వం వివరణ
- యూఏఈని కమ్మేసిన పొగమంచు..రెడ్ అలర్ట్ జారీ..!!
- రియాద్‌లో యెమెన్ సమావేశం.. స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఒమన్ ఆకాశంలో అద్భుతం.. క్వాడ్రాంటిడ్ ఉల్కాపాతం..!!
- కువైట్ లో నగదు స్మగ్లింగ్.. అడ్డుకున్న కస్టమ్స్..!!
- బహ్రెయిన్ రికార్డు..పోటెత్తిన ప్రయాణికులు..!!
- గాజాలో క్షీణించిన మానవతాపరిస్థితులు.. అరబ్ దేశాలు ఆందోళన..!!
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!







