గల్ఫ్ లో 'APNRT' కో-ఆర్డినేటర్ల నియామకం

- September 13, 2016 , by Maagulf

ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు( ఏ.పి.ఎన్.ఆర్.టి) వారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చొరవతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒక వేదిక పై తీసుకువచ్చి వారి కోసం సరైన మార్గాన్ని ఏర్పరచి  మాతృభూమికి సన్నిహితంగా ఉండి తెలుగు సాంస్కృతిక జీవనంలో మమేకమై ఉండేందుకు కృషి చేస్తున్నారు.

ప్రవాస తెలుగువారందరూ సహజ రీతిలో ఐక్యతతో మెలిగే తత్వం ఉన్నవారు కావడంతో  ఒకరికొకరు సహాయం చేసుకొనే గుణం వారి అంతరాలలో నిక్షిప్తమై ఉంది. దూర దేశాలలో ఉన్న వారి  ప్రత్యేక అవసరాలకు మరియు సామర్థ్యాలను సొంత విధానంతో  తెలుగు కమ్యూనిటీ యొక్క అంతర్భాగమైన.ఆంధ్ర ప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు వారు అధిక సంఖ్యలో ఒక బలీయమైన శక్తిగా రాష్ట్ర చరిత్రలో రూపొందడం ఇదే మొదటిసారి కావడం ఎంతో అభినందనీయం.ఆలయ పర్యాటకం,పాన్/ఆధార్,విధానపరమైన మార్గ నిర్ధేశకం,విలువైన పత్రాలు కోల్పోయినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు,పెట్టుబడుల్లో సలహా,పేరెంటల్ అసిస్టెన్స్,బ్యాంకింగ్ అసిస్టెన్స్,ప్రయాణ సేవలు, టాక్సేషన్ సలహా, న్యాయపరమైన సహాయం చేస్తుంది.అన్ని ప్రభుత్వ సంబంధించిన సమస్యలు పద్ధతులకు సంబంధించి సమర్ధమైన పరిష్కారాలను అందిస్తుంది.ఆంధ్ర ప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు ప్రత్యేక సైట్ www.apnrt.com ద్వారా సంప్రదించడానికి ఏ మాత్రం సంకోచించకండి అని భరోసా ఇస్తూ పలు  ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఎల్లప్పుడూ ఏ.పి.ఎన్.ఆర్.టి కో-ఆర్డినేటర్లను అందుబాటు లో ఉండేలా ప్రపంచవ్యాప్తంగా నియమించటం జరిగింది.ఇందులో భాగంగా గల్ఫ్ దేశాలకు నియమితులైన వారి వివరాలు ఈ క్రింది విధంగా 

యు.ఏ.ఈ 

1.అనురాధ ఒబ్బిలిశెట్టి 
2.శ్రీకాంత్ చిత్తర్వు

కువైట్

1.సుబ్బారాయుడు
2.సుధాకర రావు కుదరవల్లి 
3.మురళి బాబు జిలకర
4.నాగేంద్ర బాబు 
5.షైక్ రహమతుల్లా 

సౌదీ అరేబియా 

1.రెవెల్ ఆంథోనీ అబెల్ 
2.రాధా కృష్ణ మూర్తి రవి 
3.భాస్కర రావు మేడికొండ

ఒమాన్
1.అనిల్ కుమార్ కడించెర్ల 
2.కొత్తూరు చిన్నారావు 
3.హరి బాబు 

కతర్ 
1.వెంకప్ప భాగవతుల 
2.వీర వెంకట సత్యనారాయణ మలిరెడ్డి 
3.వీర వెంకట సత్యనారాయణ జుజ్జవరపు 

బహ్రెయిన్
1.హరిబాబు తక్కెళ్ళపాటి 
2.రఘునాధ బాబు వడ్లమూడి
3.వీర్రాజు (శివ కుమార్)

ఏ.పి.ఎన్.ఆర్.టి చైర్మన్ చంద్ర బాబు నాయుడు గారు,ఎన్నారై మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు,ఏ.పి.ఎన్.ఆర్.టి సీఈఓ రవి కుమార్ వేమూరి గారు మరియు ఏ.పి ఎన్.ఆర్.టి  టీమ్ బుచ్చి రామ్ గారు,డాక్టర్ ప్రసాద్ గారు,శేషు బాబు కానూరి గారు, డాక్టర్ నిరంజన్ గారు,డాక్టర్ మురళీ గారికి కో-ఆర్డినేటర్లు అందరూ హృదయపూర్వక ధన్యావాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com