ఐసిస్ దారుణం..
- September 14, 2016
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఏ చిన్న దేశాన్ని కూడా వదలడం లేదు..గత నెలలో వివిధ దేశాలపై అత్యంత పాశవికంగా దాడులు జరిపారు. ఏ మూల నుంచి ముప్పు సంభవిస్తుందో అన్న భయంలో అగ్ర దేశాలు వణికిపోతున్నాయి. హింసనే వారి ఆయుధంగా చేసుకొని ఐసిస్ ఉగ్రవాదులు అమలు చేస్తున్న శిక్షలు చూస్తే ఆ నరకం ఎక్కడో లేదు ఇక్కడే అన్నంతగా వణికిపోతున్నారు. ముఖ్యంగా అరబ్ దేశాల్లో ఈ దాడులు విచ్చల విడిగా కొనసాగుతున్నాయి. వీరికి చిన్నా పెద్ద ముసలీ ముతక ఆడవారు అన్న కనికరం కూడా లేకుండా అత్యంత పాశవికంగా శిక్షలు అమలు పరుస్తున్నారు.
ఒకదశలో ప్రపంచ దేశాలు ఉగ్రవాదం అంటేనే భయంతో బిక్కచచ్చిపోతున్నారు.భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు ఉగ్రవాద ముప్పు ఉందని ఇంటిలీజెన్స్ వర్గాలు తెలిపాయి. వరుసగా పండుగలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాయి. ఇక నిన్న ముస్లిం సోదరులు పవిత్రమైన బక్రీద్ పండుగను చేసుకుంటే..ఉగ్రవాదులు మాత్రం భయంకరంగా మనుషుల పీకల్ని కోసి సంబరాలు చేసుకున్నారు.అమెరికా గూఢచారుల పేరుతో కొందర్ని బందీలుగా చేసి పదునైన కత్తితో మెడలను తెగ్గోశారు. వారి మాంసాన్ని కొక్కేలకు వేలాడదీసి.. గొర్రెల తరహాలో వధించారు. అంతే కాదు దీనికి సంబంధించి 12 మిషాల వీడియోను ఐసిస్ విడుదల చేసింది. ఈ వీడియోను ఈశాన్య సిరియాలోని దెయిర్ అల్ జోర్ పట్టణంలోని ఓ జంతువధ శాలలో తీసినట్టు ప్రకటించింది. ఐసిస్ చరిత్రలోనే అత్యంత దారుణమైన చర్యగా ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









