మరో ప్రయోగం 'సోలార్ ఇంపల్స్' నుంచి
- September 14, 2016
ఒక్క చుక్క ఇంధనం అవసరం లేకుండానే ప్రపంచాన్ని చుట్టేసిన 'సోలార్ ఇంపల్స్' విమానం గుర్తుందా? అది ప్రపంచంలోనే తొలి ఇంధన రహిత విమానం. సౌరశక్తితోనే ప్రయాణించే ఆ విమానం దేశాలన్నీ చుట్టేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే.. ఇప్పుడు అలాంటిదే మరో రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు ఆ విమాన రూపకర్తలు. సోలార్ ఇంపల్స్ విమానంతో గగనతలంలో రికార్డు సృష్టించగా.. ఇప్పుడు జలమార్గం ద్వారా అలాంటిదే మరో అరుదైన ఘనతను సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకు సరికొత్త పడవను తయారు చేస్తున్నారు.
'సోలార్ ఇంపల్స్ ఆఫ్ ద సీస్'గా పిలుస్తున్న ఈ బోట్..
చుక్క ఇంధనం అవసరం లేకుండా పూర్తిగా పునరుత్పాదక శక్తితోనే నడుస్తుంది. సౌరశక్తి.. వాయుశక్తి.. హైడ్రోజన్‌తోనే నడుస్తుంది. అందుకోసం దీనికి గాలి మరలు.. సోలార్ ప్యానెళ్లను అమర్చుతున్నారు. 'ఎలక్ట్రోసిస్' విధానం ద్వారా ఈ బోట్ దానంతట అదే సముద్రపు నీటిని తీసుకుని అందులోని ఆక్సీజన్‌ను హైడ్రోజన్‌ను విడగొట్టి హైడ్రోజన్‌ను నిల్వ చేసుకుంటుంది. సూర్యరశ్మి.. గాలి తక్కువగా ఉన్నప్పుడు ఆ హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకుంటుంది.
అలా.. ఆరు సంవత్సరాలపాటు సముద్రాల్లో ప్రయాణించి ప్రపంచాన్ని చుట్టేయనుందట ఈ పడవ. ఈ యాత్ర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని రూపకర్తలు చెబుతున్నారు. క్యూబా నుంచి ప్రారంభమై న్యూ క్యాలెడోనియా మీదుగా భారత్‌లోని గోవా వరకు యాత్ర సాగనుందట. మొత్తం 101చోట్ల ఆగనుంది. దీని ప్రయాణానికి ఏటా రూ.30కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్ పశ్చిమ తీరంలోని సెయింట్ మాలో షిప్‌యార్డ్‌లో ఈ బోట్‌ను తయారు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









