హజ్ విజయవంతం: భద్రతాదళాలకు కృతజ్ఞతలు
- September 15, 2016
మినా: జీవితంలో ఒక్కసారి వచ్చే అత్యద్భుతమైన అవకాశంగా హజ్ యాత్రను ముస్లిం సోదరులు భావిస్తారు. 164 దేశాల నుంచి పెద్ద సంఖ్యలో హజ్ ప్రార్థనల కోసం వచ్చేవారికి సరైన ఏర్పాట్లు చేయడం, అలాగే వారి రక్షణ కోసం శ్రమించడం ఇలా ఈసారి 2016 హజ్ యాత్ర విజయవంతం అవుతుండడం పట్ల క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నయిఫ్ హర్షం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ ఫోర్సెస్, మిలిటరీ యాత్రీకుల భద్రత కోసం పడ్డ శ్రమను కొనియాడారు క్రౌన్ ప్రిన్స్. మినాలోని కంట్రోల్ సెంటర్‌ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ శ్రమను కొనియాడారు. హైటెక్ సిసిటివిలకు సంబంధించిన ఇపార్ట్‌మెంట్, ట్రాఫిక్స్ ఆపరేషన్స్ మరియు సెక్యూరిటీ డిటెయిల్స్ డిపార్ట్‌మెంట్స్‌ని ఆయన సందర్శించారు. యాత్రీకులు బుధవారం ఉదయాన్నే లేచి, ఒక్కొక్కరు ఏడేసి చొప్పున రాళ్ళను డెవిల్‌గా పిలవబడే కాంక్రీట్ స్ట్రక్చర్స్‌పైకి వాటిని విసిరే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అన్ని కార్యక్రమాలూ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పూర్తయ్యాయి. మినా శివార్లలో బస్ డ్రైవర్లు కూడా యాత్రీకులకు తగిన సేవలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







