సోషల్ క్లబ్బులకు లైసెన్స్ తప్పనిసరి
- September 15, 2016
దుబాయ్‌లో సోషల్ క్లబ్బులు లేదా ఆర్గనైజేషన్లకు లైసెన్స్ తప్పనిసరి. లైసెన్స్ లేకుండా సోషల్ క్లబ్స్ లేదా ఆర్గనైజేషన్లు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా, వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ (సిడిఎ) సీనియర్ అధికారి హెచ్చరించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రిజల్యూషన్ నెంబర్ 4 - 2011 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా సోషల్ క్లబ్బులు, లేదా ఆర్గనైజేషన్స్ కార్యక్రమాల్ని నిర్వహించాల్సి ఉంటుంది. సిడిఎ 2014 నుంచి స్ట్రిక్ట్‌గా ఈ ఈ నిబంధనలపై వ్యవహరిస్తోంది. లైసెన్స్ పొందాక, సోషల్ క్లబ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఉద్యోగుల్ని నియమించుకోవడం, కార్యక్రమాలు చేపట్టడం వంటివి జరుగుతాయి. సిడిఎ డైరెక్టర్ జనరల్ ఖాలిద్ అల్ కమ్దా ఈ వివరాల్ని తెలియజేస్తూ, లైసెన్స్ పొందని సంస్థలు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. నిబంధనల్ని ఉల్లంఘించినట్లయితే 2,000 దిర్హామ్‌ల నుంచి 10,000 దిర్హామ్‌ల వరకు జరీమానా చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







