'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో చిరు

- September 16, 2016 , by Maagulf
'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో చిరు

బుల్లితెరపై రెండు సెషన్స్‌లో ఓ రేంజ్‌లో హంగామా చేసింది నాగార్జున హోస్ట్‌గా వచ్చిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం. రెండు సెషన్స్‌లో అదేజోరు.. టీఆర్పీ రేటింగ్‌లోనూ ఎదురులేకుండా పోయింది. మూడోసారి మాత్రం ఆడియన్స్ నుంచి అనుకున్న స్పందన రాకపోవడంతో ఆ ఛానెల్ కొత్త ప్రయోగం మొదలుపెట్టినట్టు సమాచారం. ఈసారి నాగ్ స్థానంలో హోస్ట్‌గా చిరంజీవిని తీసుకోవాలని భావించడం, ఈ విషయమై ఆయనతో మాట్లాడడం ఓకే చేయడం జరిగిపోయింది.మాటీవీలో డిసెంబర్ 12 నుంచి సోమవారం నుంచి గురువారం రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ప్రసారం కానుందని సమాచారం. ఎట్ ప్రజెంట్ 150వ మూవీతో బిజీగావున్న మెగాస్టార్, చిత్రీకరణ 50శాతం పూర్తి అయ్యిందని, నవంబర్ చివరినాటికి షూటింగ్ ఫినిష్ చేయాలన్నది ఆయన ఆలోచన.ఆ తర్వాత 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో బిజీ కానున్నాడట. ఇదిలావుండగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అభిమానులకు చిరు దూరమయ్యాడన్న ప్రచారం వుంది. ఈ కార్యక్రమం ద్వారా మళ్లీ దగ్గరకావచ్చునన్నది మెగా ఫ్యాన్స్‌లోని ఓ వర్గం భావిస్తోంది. ఒకప్పుడు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి గెస్ట్‌గా చిరంజీవి హాజరైన విషయం తెల్సిందే!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com