పర్షియన్ గల్ఫ్‌లో తిష్ట వేసిన అమెరికా సేనలు వైదొలగాలి: ఆలీ షంఖానీ
- September 16, 2016
పర్షియన్ గల్ఫ్‌లో తిష్ట వేసిన అమెరికా సేనలు తక్షణమే ఇక్కడి నుండి వైదొలగాలని ఇరాన్ జాతీయ భద్రతా మండలి ప్రధాన కార్యదర్శి ఆలీ షంఖానీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పర్షియన్ గల్ఫ్‌లో ప్రాంతీయ దేశాల నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు కొనసాగటానికి ఎటువంటి చట్టపరమైన ప్రాతిపదిక లేదని, అంతర్జాతీయంగా మద్దతుకూడా లేదని అన్నారు. ఇరాన్ తమను రెచ్చగొడుతోం దంటూ అమెకిరా చేస్తున్న ఆరోపణలు తమపై అమెరికన్ మీడియా చేస్తున్న ఊహాగానాలు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో వున్న అమెరికా యుద్ధ నౌకల సమీపంలోకి ఇరాన్ యుద్ధ నౌకలు వస్తున్నాయంటూ మీడియాలో వెలువడుతున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన స్పష్టంచేశారు.అమెరికా పర్షియన్ గల్ఫ్‌ను వదిలి వెళ్లిపోతే ఇక్కడ ఎటువంటి సమస్యలూ వుండవన్నారు
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







