ఆధ్యాత్మిక గురువు ఓషో గెటప్‌లో ఉన్న మోహన్‌లాల్ ..

- September 16, 2016 , by Maagulf
ఆధ్యాత్మిక గురువు ఓషో గెటప్‌లో ఉన్న  మోహన్‌లాల్ ..

సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తన అభిమానులను థ్రిల్ చేశాడు. ఓనమ్ పండుగ సందర్భంగా తన ఫేస్‌బుక్ పేజీలో ఓ కొత్త ఫోటో పోస్ట్ చేశాడు. అది ఆయన అభిమానుల్ని కొంత టెన్షన్‌కు గురి చేసింది. ఆధ్యాత్మిక గురువు ఓషో గెటప్‌లో ఉన్న ఫోటోను మోహన్‌లాల్ పోస్ట్ చేశాడు. దాన్ని చూసిన ఫ్యాన్స్ కొంత తికమక పడ్డారు. బహుశా ఇది కొత్త ప్రాజెక్టు అయి ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరికీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరన్న విషయం అర్థం కాలేదు. కానీ మోహన్‌లాల్ మాత్రం తన ఫోటోకు ఓ ట్యాగ్‌లైన్ రాశాడు. తన ఆధ్యాత్మిక చింతనకు ఓషోనే కారణమన్నాడు. ఈ ఫోటో ఓషోకు మారువేషమన్నాడు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com