ఏపీలో అన్ని పరీక్షలు పేపర్‌లెస్‌ ఎగ్జామ్సేనని : గంటా

- September 16, 2016 , by Maagulf
ఏపీలో అన్ని పరీక్షలు పేపర్‌లెస్‌ ఎగ్జామ్సేనని :  గంటా

 ఇక నుంచి ఏపీలో అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, దాని కోసం ముందుగా కొన్ని నమూనా పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విధానం వల్ల అక్రమాలకు అవకాశం ఉండదన్నారు. ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణపై కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. భవిష్యత్‌లో ఏపీలో అన్ని పరీక్షలు పేపర్‌లెస్‌ ఎగ్జామ్సేనని వెల్లడించారు. సమయాభావంతో గత ఎంసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించలేకపోయామన్నారు. అక్టోబర్‌ 15న డిజిటల్‌ క్లాస్‌రూంలు ఏర్పాటు, ప్రతిభా అవార్డుల ప్రదానం ఉంటుందని, ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలను జంబ్లింగ్‌ పద్దతిలోనే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com