గురు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రానా రిలీజ్ చేయనున్నాడు..

- September 17, 2016 , by Maagulf
గురు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్  రానా రిలీజ్ చేయనున్నాడు..

బాబు బంగారం సినిమాతో ఆకట్టుకున్న సీనియర్ హీరో వెంకటేష్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టనున్నాడు. అయితే కాస్త భిన్నంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వటానికి ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. హిందీ, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సాలా ఖద్దూస్ సినిమాను తెలుగులో గురు పేరుతో రీమేక్ చేస్తున్నాడు వెంకీ.ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. ఒరిజినల్ వర్షన్ లో బాక్సింగ్ స్టూడెంట్ గా నటించిన రితికా సింగ్, ఈ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వనుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు( శనివారం) సాయంత్రం 5 గంటలకు యంగ్ హీరో రానా తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయనున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com