'మోహన్ బాబు' సన్మాన మహోత్సవానికి టాలీవుడ్ తారలు...

- September 17, 2016 , by Maagulf
'మోహన్ బాబు' సన్మాన మహోత్సవానికి టాలీవుడ్ తారలు...

'మోహన్ బాబు'..'చిరంజీవి'.. వీరిపై టాలీవుడ్ లో రకరకాల కథనాలు వెలువడుతుంటాయి. వీరి మధ్య వైరం ఉందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. తాజాగా చిరు..మోహన్ బాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో ఆదివారం రాత్రి సుబ్బరామిరెడ్డి జన్మది వేడుకలు జరిగాయి. ఇదే వేడుకలో 'మోహన్ బాబు'కు సన్మాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ మహోత్సవానికి టాలీవుడ్ తారలు...ఇతర రాజకయ నేతలు తరలివచ్చారు. ఈ వేడుకకు మెగాస్టార్ 'చిరంజీవి' కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ..ఫంక్షన్ కు రావాలని 'మోహన్ బాబు' స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని పేర్కొన్నారు. ఇంతకు ముందు తన దగ్గర డేట్స్ ఉండేవని, కానీ ప్రస్తుతం సినిమా షూటింగ్ ఉండటంతో ఏం చేసినా ముందే ప్లాన్ చేసుకోవాల్సి వస్తోందన్నారు.వాస్తవానికి నేడు కూడా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని, కానీ ఇక్కడికి రాకపోతే ఓ రాక్షసుడితో గొడవైపోతుందన్నారు. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేయండని యూనిట్ సభ్యులకు చెప్పినట్టు 'చిరంజీవి' తెలిపారు. 'మోహన్ బాబు' చూపే ప్రేమ రాక్షస ప్రేమని, దాని వెనుక ఎంతో వాత్సల్యం దాగుంటుందని 'చిరంజీవి' పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com