'కార్ ఫర్ సేల్' రోడ్లుపై ఖాళీ
- September 19, 2016
మస్కట్: రోడ్లకు ఇరు వైపులా పబ్లిక్ ప్లేసెస్‌లో 'కార్ ఫర్ సేల్' అంటూ సెకెండ్ హ్యాండ్ కార్లను ప్రదర్శనకు ఉంచేవారిపట్ల కఠినంగా వ్యవహరించనున్నారు. రెండు వారాల గడువు ఇచ్చి, అలాంటి వాహనాల్ని తీసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో, ముందస్తుగానే చాలా చోట్ల రోడ్లపైనుంచి కార్లు ఖాళీ అవుతున్నాయి. దాంతో ఇప్పటిదాకా కార్ల డిస్ప్లేతో నిండిపోయిన రోడ్లు, పలు వీధులు ఇప్పుడు క్లీన్‌గా కనిపిస్తున్నాయని నివాసితులు చెప్పడం జరుగుతోంది. రాయల్ ఒమన్ పోలీసులతో కలిసి మస్కట్ మునిసిపాలిటీ, రోడ్లపై కనిపించే 'కార్ ఫర్ సేల్' వాహనాలకు నోటీసులు అంటిస్తున్నారు. ముందుస్తుగా ఈ నోటీసులను పసిగట్టి, వాహనాలు తొలగిస్తే సరే సరి, లేదంటే వాహనం టౌల్ చేయబడుతుంది. టౌలింగ్ ఖర్చు 25 నుంచి 50 ఒమన్ రియాల్స్తోపాటు, జరీమానాగా 200 ఒమన్ రియాల్స్ చెల్లించవలసి ఉంటుంది వాహన యజమానులు. టౌలింగ్ చేసిన తర్వాత కూడా వాహనాన్ని తీసుకెళ్ళేందుకు రాకపోతే, కొన్నాళ్ళపాటు వేచి చూసి, వాహనాన్ని వేలం వేస్తారు. ఈ హెచ్చరికలతో ఒక్కసారిగా అంతా అప్రమత్తమయ్యారు. చాలావరకు రోడ్లు ఇప్పుడు కార్ ఫల్ సేల్ వాహనాలు లేకుండా క్లీన్‌గా కనిపించడం ఆహ్వానించదగ్దదే.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









