ఆస్ట్రేలియా ఎంటర్‌ప్రెన్యూవర్ వీసా వల్ల పర్మినెంట్ రెసిడెన్స్‌కు బాట
- September 19, 2016
ప్రతిభానైపుణ్యాలుగలవారికి శుభవార్త! ఆస్ట్రేలియాలో తమ ఘనతను చాటాలనుకునేవారికి ఆ దేశం ఆకర్షణీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. అత్యుత్తమ ప్రతిభావంతులను తమ దేశంలోనే స్థిరపడేలా చేయడానికి ఈ పథకం దోహదపడుతుంది. దీనిలో భాగంగా కొత్త రకం వీసాలను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇమ్మిగ్రేషన్, బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ మంత్రి పీటర్ దుట్టన్ మాట్లాడుతూ బిజినెస్ ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్ వీసా ప్రోగ్రామ్ సహా వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణల ద్వారా ఆర్థిక వృద్ధిని పరుగులెత్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎంటర్‌ప్రెన్యూవర్ వీసా వల్ల పర్మినెంట్ రెసిడెన్స్‌కు బాటలు వేస్తుందని చెప్పారు.
2 లక్షల డాలర్ల పెట్టుబడికి థర్డ్ పార్టీ నుంచి మద్దతు లభిస్తుందని, ప్రతిభావంతులు తమ వినూత్న ఆలోచనలను ఆస్ట్రేలియాలో ఆచరణలో పెట్టవచ్చునని తెలిపారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం నైపుణ్యంగలవారికి నిర్వహించే పరీక్షల్లో ఇటీవల మార్పులు జరిగాయి. ఆస్ట్రేలియాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం వంటి రంగాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్ క్వాలిఫికేషన్ పొందినవారిని ఆస్ట్రేలియాలోనే స్థిరపడేలా చేయడానికి ఈ మార్పులు దోహదపడతాయి. ఈ గ్రాడ్యుయేట్లకు స్కిల్‌డ్ మైగ్రేషన్ ప్రోగ్రామ్ క్రింద అదనపు పాయింట్లు ఇస్తారు.
దీనివల్ల ఆస్ట్రేలియాలో పర్మినెంట్ రెసిడెన్స్ వీసా మంజూరయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ మార్పులు ప్రభుత్వం చేపట్టిన జాతీయ నూతన ఆవిష్కరణలు, సైన్స్ ఎజెండాకు అనుబంధంగా ఉపయోగపడతాయని ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ సైన్స్ మినిస్టర్ గ్రెగ్ హంట్ చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!







