అమరులైన ఉరీ జవాన్లకు ఘన నివాళులు

- September 20, 2016 , by Maagulf
అమరులైన ఉరీ జవాన్లకు ఘన నివాళులు

ఉరీ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు వారివారి స్వగ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించారు. భారీ సంఖ్యలో జనం అందులో పాల్గొన్నారు. అమరవీరులకు తగిన రీతిలో నివాళులర్పించారు.
ఎక్కడ చూసినా విషాదఛాయలే కనిపిస్తున్నాయి. ఉరీ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్వగ్రామాల్లో విషాదం అలముకుంది. ఇక ప్రాణాలు కోల్పోయిన జవానుల కుటుంబసభ్యుల బాధ వర్ణాణాతీతం.

వారిని ఓదార్చడం ఎవ్వరివల్ల కావడం లేదు. గయకు చెందిన నాయకేస్ విద్యార్థి ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడయ్యాడు. అతడికి గ్రామస్థులు అరుదైన నివాళి అర్పించారు. విద్యార్థి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించేందుకు వీలుగా పాడైన రోడ్లను చదును చేశారు. ఇక అతని మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.
పశ్చిమబెంగాల్‌కు చెందిన జవాన్ గంగాధర్ దల్వీకి హౌరాలో అంత్యక్రియలు నిర్వహించారు. వందలాది మంది సైనికులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. గంగాధర్ అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. హవల్దార్ ఎస్ఎస్ రావత్ అంతిమయాత్ర అతని స్వస్థలం రాజస్థాన్‌లో జరిగింది. భారీగా జనం తరలివచ్చారు. మహారాష్ట్రలోని సతారాలో లాల్స్‌నాయక్ జీ.శంకర్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. మంగళవాయిద్యాలతో శంకర్‌ మృతదేహాన్ని ఊరేగించారు. వీరజవాన్ నీకు సలాం అంటూ ఊరంతా గ్రామస్థులు ముగ్గుతో రాశారు. అతని సమాధిని పూలతో అలంకరించారు. ఉత్తర్‌ప్రదేశ్ సంత్‌కబీర్ నగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన సిఫాయి గణేశ్ శంకర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులను కంటతడి పెట్టించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com