ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్షిపణి ప్రయోగం..
- September 20, 2016
ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలు ఛేదించగల లాంగ్ రేంజ్ క్షిపణిని మంగళవారం భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు డీఆర్‌డీఓ అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణిని ఇజ్రాయెల్, భారత్ సంయుక్తంగా రూపొందించాయి. లాంగ్ రేంజ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని.. త్వరలో మరిన్ని విడతల్లో ఈ క్షిపణిని ప్రయోగిస్తామని అధికారులు తెలిపారు. ఈ క్షిపణిలో మల్టీ ఫంక్షనల్ సర్వైలెన్స్ అండ్ త్రెట్ అలర్ట్ రాడార్(ఎంఎఫ్-స్టార్) సిస్టమ్ ఉంటుంది. .భారత్, ఇజ్రాయెల్ రూపొందించిన ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే మీడియం రేంజ్ క్షిపణిని డీఆర్‌డీఓ జూన్ 30- జులై 1 మధ్య వరసగా మూడుసార్లు విజయవంతంగా ప్రయోగించింది.గత ఏడాది ఐఎన్‌ఎస్ కోల్‌కతా వాహక నౌకపై నుంచి కూడా ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే లాంగ్‌రేంజ్ క్షిపణి(ఎల్‌ఆర్-ఎస్‌ఏఎం)ని విజయవంతంగా ప్రయోగించారు
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







