తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై భేటీకి రంగం సిద్ధo..
- September 20, 2016
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై తెలంగాణా, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు బుధవారం ఢిల్లీ లో చర్చలు జరపబోతున్నారు. ఈ అపెక్స్ కౌన్సిల్ మొట్ట మొదటి భేటీకి రంగం సిద్ధమైంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా..పాలమూరు-రంగారెడ్డి-దిండి ఎత్తిపోతలు, కృష్ణా, గోదావరి జలాల్లో వాటా అంశాలపై ఈ సిఎంలు చర్చించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి-దిండి ఎత్తిపోతలు పాత ప్రాజెక్టులేనని కేసీఆర్ నొక్కి చెప్పనున్నారని తెలుస్తోంది. ఏపీలో గోదావరి నుంచి కృష్ణా లోకి మళ్లించిన నీటిలో తెలంగాణాకూ వాటా ఉందన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించనున్నారు.అయితే చంద్రబాబు వాదన మరోలా ఉండే అవకాశం ఉంది.పాలమూరు-రంగారెడ్డి-దిండి ప్రాజెక్టులు కొత్తవేనని, పునర్విభజన చట్టంలోని 11 వ షెడ్యూల్ లో కూడా ఈ ప్రాజెక్టులు లేవన్న విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. పోలవరం పూర్తి అయ్యేలోగా కుడి కాలువను వినియోగించుకుని వృధాగా పోయే గోదావరి జలాల వినియోగానికే పట్టిసీమ చేపట్టామని, పోలవరం నిర్మాణం తరవాత ఇది ఉండదని, పట్టిసీమ కొత్త ప్రాజెక్టు కాదని ఆయన వివరించనున్నారు. ఇలా వీరి వాదనలు వేర్వేరుగా ఉన్న నేపథ్యంలో ఈ అపెక్స్ కౌన్సిల్ భేటీ ఎలా ఉండబోతున్నదానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







