వలసదారుడి ఇంట్లో భారీ చోరీ

- September 20, 2016 , by Maagulf
వలసదారుడి ఇంట్లో భారీ చోరీ

మనామా: ఓ వలసదారుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు, ఇంట్లోకి ప్రవేశించి విలువైన బంగారు నగల్ని దోచుకున్నారు. అయితే ఈ దోపిడీ క్షణాల్లో జరిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. యోగేష్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివశిస్తున్నాడు ఆ ఇంట్లో. పది నిమిషాల సమయంలోనే ఈ దోపిడీ జరిగిపోయినట్లు యోగేష్‌ వివరించారు. తన భార్య పది నిమిషాల పాటు వేరే పని మీద బయటకు వెళ్ళడంతో, దొంగలు ఇదే సరైన సమయమని భావించి, ఆ సమయంలో దోపిడీకి పాల్పడినట్లు యోగేష్‌ పోలీసులకు తెలిపాడు. ఎప్పటినుంచో తన భార్య కదలికల్ని, ఇంటి పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించినవారే దోపిడీ చేసి ఉంటారని యోగేష్‌ అనుమానం వ్యక్తం చేశారు. కిచెన్‌ రూమ్‌లోని విండో ద్వారా దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే అపార్ట్‌మెంట్‌లోకి చొరబడేందుకు భారీ నిచ్చెన అవసరం అవుతుందని, దొంగలు వచ్చి వెల్ళిన తీరు విస్మయం కలిగిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు. పోలీసులు అపార్ట్‌మెంట్‌ వాసుల్ని అడిగి దొంగతనం జరిగిన తీరుని తెలుసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com