మట్టి చరియలు విరిగిపడి 10 మంది మృతి..
- September 20, 2016
ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్ లో తాజాగా భారీ వర్షాలు, వరదలు కారణంగా 10 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారని విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. గౌర్టు జిల్లాలో భారీ వర్షాలతో రెండు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. వందలాది మందిని ప్రభుత్వ కార్యాలయ భవనాలు, మిలటరీ స్టేషన్స్ కి తరలించి ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు.భారీగా మట్టి చరియలు రెండు ఇళ్లపై విరిగిపడ్డాయి. దీంతో అందులో నివసిస్తున్న ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు గల్లంతయ్యారని తెలిపారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.ఈ సహాయక చర్యల్లో సైనికులు, పోలీసులు పాల్గొన్నారని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







