మహిళా ఉద్యోగుల భద్రతలో తెలంగాణ రాష్ట్రానికి రెండో ర్యాంకు
- September 21, 2016
మహిళా ఉద్యోగుల భద్రతలో తెలంగాణ రాష్ట్రానికి రెండో ర్యాంకు లభించింది. అలాగే ఉద్యోగాలు చేసే మహిళలకు ఢిల్లీ నగరం పరమ వేస్ట్ అని, ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బెస్ట్ అని తేలింది. అలాగే రెండోస్థానంలో తెలంగాణ నిలవగా, ఆంధ్రప్రదేశ్‌కు ఆరోస్థానం లభించింది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్), నాథన్ అసోసియేట్స్ సంస్థలు సంయుక్తంగా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రధానంగా నాలుగు అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు పలు ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఆయా సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిల భద్రతకు తగు ఏర్పాట్లు చేసింది. షీ టీమ్స్ ఏర్పాటుచేయడమేగాక మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటుచేసింది. తెలంగాణలో ఏర్పాటుచేసిన షీ టీంల వ్యవస్థపై ఆయా రాష్ట్రాలు కూడా ఆస్తక్తి చూపి అధ్యయనం కోసం హైదరాబాద్‌కు కూడా వచ్చాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







