ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పీటముడిగా మారిన జలవివాదాలు..
- September 21, 2016
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పీటముడిగా మారిన జలవివాదాలు పరిష్కారం దిశగా ఢిల్లీలో తొలి అడుగు పడింది. రాష్ట్ర విభజన తర్వాత అపెక్స్ కౌన్సిల్ భేటీ అవడం ఇదే తొలిసారి. కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి అధ్యక్షతన మొదలైన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ హాజరయ్యారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది.ముందుగా కేంద్రమంత్రి ఉమాభారతి ఇద్దరు ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ తరపున ఐదుగురు సభ్యులు మాత్రమే రావాలని మొదట చెప్పినప్పటికీ ఎంపీలు, సెక్రెటరీలు, అధికారులను కూడా ఈ సమావేశానికి అనుమతించారు. సుమారు 40మందికి పైగా సమావేశానికి హాజరయ్యారు. కమిటీ రూమ్‌లో తొలుత కృష్ణానదీ యాజమాన్య బోర్డు అధికారుల ప్రజెంటేషన్ కొనసాగింది.అనంతరం ఏపీ ప్రభుత్వం తరపున సాగునీటి పారుదలశాఖ కార్యదర్శి శశిభూషణ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పది నిమిషాల పాటు ప్రజెంటేషన్ కొనసాగింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తరపున సాగునీటి పారుదలశాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి తన ప్రజెంటేషన్‌ను ఇస్తున్నారు. అనంతరం అజెండాలోని అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.సమావేశానికి ముందు ఇద్దరు సీఎంలు వేర్వేరుగా కేంద్రమంత్రి ఉమాభారతిని మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. అక్కడే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరినొకరు అభివాదం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







