పోలవరం పనులకు బెలిజ్ ట్రక్లు

- September 21, 2016 , by Maagulf
పోలవరం పనులకు బెలిజ్ ట్రక్లు

భారీ బరువులను మోయ గలిగే ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్కుగా పేరొందిన బెలాజ్ ట్రక్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు చేరుకుంది. పోలవరం పనులు నిర్వహించేందుకు ఈ భారీ ట్రక్కును త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థ కొనుగోలు చేసింది. 220 నుంచి 240 టన్నుల బరువును సునాయాసంగా మోయగలిగే ఇటువంటి ట్రక్కులు ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపిస్తాయి. ఉక్రేనియా సంస్థ బెలాజ్ కు చెందిన ఈ ట్రక్ ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద ట్రక్కుగా నిలిచింది. దీన్ని జాతీయ రహదారుల నిర్మాణం, మైనింగ్ లలో వినియోగించడంతోపాటు, భారీ వస్తువులను తరలించేందుకూ వాడతారు. 120 టన్నుల బరువును మోయగలిగే బెలాజ్ డంపర్ ను మహరాష్ట్ర వాడకంలోకి తేగా... 200 టన్నులకు పైగా బరువును మోయగలిగే స్థాయి కలిగిన ఈ బెలాజ్ ట్రక్ మాత్రం ఇండియాలోనే మొట్టమొదటిసారి వాడకంలోకి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com