తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంటు ..!!

- September 21, 2016 , by Maagulf
తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంటు ..!!

ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంటును 648 మెగావాట్ల స్థాపక సామర్థ్యంతో అదాని గ్రూపు తమిళనాడులో నిర్మించింది. రామనాథపురం జిల్లాలోని కముధి వద్ద దీన్ని ఈరోజు ప్రారంభించారు. సబ్‌స్టేషన్‌ ద్వారా దీనిని గ్రిడ్‌కు అనుంసంధానిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం అధికారికంగా ప్రారంభించారు. 5వేల ఎకరాల విస్తీర్ణంలో రూ.4,550 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. నిర్మాణానికి కావాల్సిన పరికరాలు, యంత్రాలను వివిధ దేశాల నుంచి సమకూర్చి 8 నెలల్లో ప్లాంటును పూర్తి చేశారు. నిర్దిష్ట సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రోజుకి 8,500 మంది కార్మికులు పని చేశారు. ఈ ప్లాంటు 3.8 లక్షల ఫౌండేషన్లు, 25లక్షల సోలార్‌ మాడ్యూల్స్‌, 576 ఇన్వర్టర్లు, 154 ట్రాన్స్‌ఫార్మర్లు, 6వేల మీటర్ల పొడవు గల కేబుల్స్‌ను కలిగి ఉంది. ఈ ప్లాంటు నిర్మాణం తమిళనాడుకే కాక మొత్తం దేశానికే చిరస్మరణీయ సందర్భమని అదాని గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదాని తెలిపారు. ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రభుత్వం అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com