ఈజిప్టు మధ్యధరా సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది
- September 22, 2016
ఈజిప్టు మధ్యధరా సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. శరణార్థులను తీసుకు వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. 400 మంది గల్లంతు అయ్యారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదం కర్ఫ్ ఎల్ షేక్ వద్ద చోటు చేసుకుందని... ఈ ప్రమాదం జరిగిన సమయంలో 600 మంది శరణార్థులు బోటులో ఉన్నారని చెప్పారు.
వారంతా ఈజిప్టియన్లు, సరియన్లు, సుడాన్ వాసులు, సోమాలియాకు చెందిన వారని వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బోటులో ప్రయాణిస్తున్న 150 మందిని కోస్ట్ గార్డు సిబ్బంది కాపాడరని పేర్కొన్నారు. వారిని రషిద్ నగరంలోని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







