జీవా, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం 'కవలై వేండాం'
- September 22, 2016
'రంగం' వంటి సూపర్‌హిట్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు జీవా నటిస్తున్న తాజా చిత్రం 'కవలై వేండాం'. ఇందులో కాజల్ నాయికగా నటిస్తోంది. 'యామిరుక్క బయమేన్' ఫేమ్ డీకే దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తమిళంలో భారీ వ్యయంతో తీస్తున్న ఈ చిత్రం తెలుగు హక్కులను డి.వి.
సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన భారీమొత్తం చెల్లించారు. డి.వెంకటేష్ మాట్లాడుతూ "రంగం' చిత్రం తెలుగులో ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అందులో హీరోగా నటించిన జీవా, అగ్ర నాయిక కాజల్ కలిసి నటించిన చిత్రం అంటే అంచనాలు భారీగా ఉంటాయి.
ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ సైతం ఆకట్టుకుంది. అంచనాలు పెంచింది. ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించాలనే ఉద్దేశంతో ఫ్యాన్సీ రేట్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. త్వరలోనే తెలుగు టైటిల్ ప్రకటిస్తాం.
మిగతా కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల తేదీని ప్రకటిస్తాం. 'రంగం' చిత్రాన్ని తమిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా తమిళంలో తీయడం విశేషం అని చెప్పారు. జీవా, కాజల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శ్రుతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర పాత్రధారులు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







