తదుపరి చిత్రంకు రెడీ అవుతున్న నిఖిల్..
- September 22, 2016
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ జాగ్వార్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా కానుకగా ముందుకు రానుంది జాగ్వార్ చిత్రం. ఈ చిత్రం రిలీజ్ కాకముందే కుమార స్వామి తన కొడుకు తదుపరి చిత్రంపై అప్పుడే ఆలోచనలు చేస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్ నిఖిల్ రెండో సినిమాను డైరెక్ట్ చేస్తారని జాగ్వార్ ఆడియో రిలీజ్ సందర్భంగా కుమార్ స్వామి ప్రకటించారు. అయితే ఈ లిస్టులో పూరి జగన్నాథ్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నట్లు సమాచారం. కొడుకు కోసం ఎక్కడా రాజీపడట్లేదు కుమారస్వామి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







