రాజస్థాన్‌లో కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్‌ యూఏవీ విమానం..

- September 22, 2016 , by Maagulf
రాజస్థాన్‌లో కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్‌ యూఏవీ విమానం..

భారత వైమానిక దళానికి చెందిన ఓ మానవ రహిత విమానం(యూఏవీ) రాజస్థాన్‌లో కుప్పకూలింది. జైసల్మేర్‌కు 5 కిలోమీటర్ల దూరంలో బడా బాగ్‌ వద్ద విమానం కూలినట్లు రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ మనీశ్‌ ఓజా వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఓజా తెలిపారు.డ్రోన్లుగా పిలిచే ఈ మానవ రహిత విమానాలు రిమోట్‌ కంట్రోల్‌ లేదా ఆటోమేటిక్‌ టెక్నాలజీ సాయంతో పనిచేస్తాయి. గగనతల పర్యవేక్షణ నిమిత్తం రక్షణ, వైమానిక శాఖల్లో వీటిని ఉపయోగిస్తారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com