'వీడు గోల్డ్‌ ఎహే' చిత్రంలో 'కోపాలెందుకు.. బాబోయ్‌' అనే రెండో పాట విడుదల ..

- September 22, 2016 , by Maagulf
'వీడు గోల్డ్‌ ఎహే' చిత్రంలో 'కోపాలెందుకు.. బాబోయ్‌' అనే రెండో పాట విడుదల ..

 మద్దిలపాలెం సీఎంఆర్‌ సెంటర్‌లో గురువారం సాయంత్రం 'వీడు గోల్డ్‌ ఎహే' చిత్రంలో 'కోపాలెందుకు.. బాబోయ్‌' అనే రెండో పాట ఆడియోను యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయకుడు సునీల్‌ మాట్లాడుతూ తాను నటించిన 'మర్యాద రామన్న' చిత్రం కన్నా ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూడదగిన చిత్రమని, ఈ చిత్రంసరికొత్త కోణంలో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సినీనటి రిచా పటేల్‌, దర్శకుడు వీరు, చిత్రం యూనిట్‌ సభ్యులు బెనర్జీ, చరణ్‌దీప్‌, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com