ఫ్రాన్స్‌ నుంచి మన దేశానికి రఫెల్ యుద్ధ విమానాలు రాబోతున్నాయి...!

- September 23, 2016 , by Maagulf
ఫ్రాన్స్‌ నుంచి మన దేశానికి రఫెల్ యుద్ధ విమానాలు రాబోతున్నాయి...!

ఫ్రాన్స్‌ నుంచి మన దేశానికి రఫెల్ యుద్ధ విమానాలు రాబోతున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. 36 యుద్ధ విమానాలను రూ.58 వేల కోట్లు చెల్లించి భారతదేశం కొనుగోలు చేయబోతోంది. ఈ ఒప్పందంపై భారతదేశ రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఫ్రెంచ్ రక్షణ మంత్రి జీన్ యవెస్ లెడ్రియన్ ఢిల్లీలో సంతకాలు చేశారు. ఈ యుద్ధ విమానాలకు రెండు ఇంజిన్లు ఉంటాయి. మొత్తం ఖరీదులో 15 శాతం బయానాగా చెల్లిస్తారు. మెటీయర్ క్షిపణి సహా విడి భాగాలు, ఆయుధాలను కూడా భారతదేశానికి ఫ్రాన్స్ సరఫరా చేస్తుంది. ఈ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదని సమాచారం. 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సునాయాసంగా దెబ్బతీయగల సామర్థ్యం దీని సొంతమని చెప్తున్నారు.దీని రాకతో దక్షిణాసియాలో మన దేశం మరింత శక్తి సంపన్నమవుతుందంటున్నారు. చైనా, పాకిస్థాన్‌లకు ఇటువంటి ఆయుధ సంపత్తి లేదని తెలుస్తోంది. తుది ఒప్పందం జరిగిన తేదీ నుంచి 18 నెలలలోగా మొదటి రఫెల్ యుద్ధ విమానం బట్వాడా జరుగుతుంది. ప్రస్తుతం భారత వైమానిక దళానికి కనీసం 126 యుద్ధ విమానాలు అవసరం.ఈ ఒప్పందం గత జనవరిలోనే జరగవలసి ఉంది, కానీ ధర తగ్గించాలని భారతదేశం పట్టుబట్టడంతో వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com