రజనీను కలిసిన ఎమ్.ఎస్. ధోనీ
- September 23, 2016
భారత క్రికెటర్ ఎమ్.ఎస్. ధోనీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను శుక్రవారం సాయంత్రం కలిశారు. చెన్నైలో నిర్వహించిన 'ఎమ్.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' చిత్ర ప్రచార కార్యక్రమానికి ధోనీ హాజరయ్యారు. అనంతరం హీరో సుషాంత్‌సింగ్ రాజ్‌పుత్ తదితరులతో రజనీకాంత్‌ను కలిసి ఆయనతో కొంతసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ధోనీ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'రజనీకాంత్ సార్‌తో' అని పోస్ట్ చేశారు. ఇటీవల 'కబాలి'లో రజనీలా కుర్చీపై స్టైల్‌గా కూర్చుని ఆయన అభిమానినని చెప్పకనే చెప్పిన ధోనీ.. ఇవాళ తలైవాను కలవడంతో ఎంత ఆనందపడుతుంటారో చెప్పకర్లేదు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







