తమిళనాడు వాసులకు ఉచిత వైఫై సేవలు ..
- September 23, 2016
తమిళనాడు వాసులకు ఉచిత వైఫై సేవలను అందించేందుకు ఏఐఏడీఎంకే ప్రభుత్వం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో అమ్మ ఉచిత వైఫై జోన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాకాలు చేస్తోంది. ఇప్పటికే తమిళనాడులో అమ్మ పేరుతో అమ్మ వాటర్, అమ్మ సిమెంట్, అమ్మ మెడిసిన్, అమ్మ క్యాంటీన్‌తో పాటు పలు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత వైఫైని అందించేందుకు జయలలిత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బస్స్టాండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, పార్కులు, పాఠశాలల్లో ఉచిత వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.తొలి దశలో భాగంగా 50 పాఠశాలల్లో రూ.10కోట్ల వ్యయంతో ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







