స్కూల్ ఫీజ్ పెంపు - ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే!
- September 24, 2016
షార్జా: షార్జా ఎమిరేట్‌లో స్కూల్స్, ఇష్టమొచ్చినట్లుగా ఫీజుల్ని పెంచేయడానికి వీల్లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. షార్జా ఎడ్యుకేషనల్ జోన్ (ఎస్ఇజెడ్ - సెజ్) అధికారులు ఈ మేరకు స్పష్టతనిచ్చారు. పీజుల్ని పెంచాలనుకుంటున్న విద్యా సంస్థలు, తమ సంస్థల్లో కల్పించే సౌకర్యాలను పెంచుకోవలసి ఉంటుందనీ, ఆ తర్వాత మినిస్ట్రీ నుంచి అలాగే సెజ్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సెజ్ వర్గాలు తెలిపాయి. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత, అధికారులు ఆ స్కూళ్ళలో పర్యటించి అక్కడ లభించే వసతుల్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత స్కూళ్ళలో ఫీజు పెంపుపై ఓ నిర్ణయానికి వస్తారు. అయితే కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభమవుతుండడంతో చాలా స్కూళ్ళు ఇష్టమొచ్చినట్లుగా ఫీజుల్ని పెంచేసి, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇలాంటి స్కూళ్ళపై దాడులు తప్పవని, కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







