డ్రైవింగ్‌ లైసెన్సులు సరెండర్‌ చేశాకే రెసిడెంట్‌ పర్మిట్ల రెన్యూవల్స్‌

- September 24, 2016 , by Maagulf
డ్రైవింగ్‌ లైసెన్సులు సరెండర్‌ చేశాకే రెసిడెంట్‌ పర్మిట్ల రెన్యూవల్స్‌

100,000 డొమెస్టిక్‌ వర్కర్స్‌ తమ డ్రైవింగ్‌ లైసెన్సుల్ని సరెండర్‌ చేస్తే తప్ప, వారి వర్క్‌ పర్మిట్‌ని రెన్యువల్‌ చేసే అవకాశం లేదని పాస్‌పోర్ట్స్‌ అండ్‌ సిటిజన్‌షిప్‌ ఎఫైర్స్‌ - ఇంటీరియర్‌ మినిస్ట్రీ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ మేజర్‌ జనరల్‌ షేక్‌ మజెన్‌ అల్‌ జర్రా చెప్పారు. డొమెస్టిక్‌ వర్కర్స్‌ తమ డ్రైవింగ్‌ లైసెన్సుల్ని ఉపయోగించి, వాహనాల్ని నడుపుతున్నారనీ, ఆ కారణంగా విపరీతమైన ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కారణంగానే వారి డ్రైవింగ్‌ లైసెన్సుల రద్దు కోసం వర్క్‌ పర్మిట్లతో లింక్‌ పెట్టినట్లు వివరించారాయన. అలాగే, స్పాన్సర్స్‌ కూడా కొత్తగా వర్క్‌ పర్మిట్స్‌ కోసం అప్లయ్‌ చేయడానికి వీల్లేకుండా నిబంధనల్ని కఠినతరం చేశారు. ఈ నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందని మినిస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com