న్యూ సెక్యూరిటీ ప్లాన్
- September 24, 2016
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - రిలేషన్స్ నఅండ్ సెక్యూరిటీ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ అదెల్ అహ్మద్ అల్ హషాష్ మాట్లాడుతూ, సెక్యూరిటీ సెక్టార్స్ని అప్రమత్తంగా ఉంచామనీ, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండడంతో సెక్యూరిటీ ప్లాన్ విషయంలో అనేక కొత్త చర్యలు తీసుకున్నామని వివరించారు. 486 పోలీస్ పెట్రోల్స్‌ని పలు స్ట్రీట్స్‌లో, స్కూల్స్ వద్ద ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడనున్నామని అన్నారు. అలాగే ట్రాఫిక్ లైట్ టైమింగ్స్‌ని కూడా పరిస్థితులకు అనుగుణంగా మార్చుతారు. సీనియర్ సెక్యూరిటీ అధికారుల్ని ఈ మేరకు ప్రత్యేక అధికారులుగా నియమించి, పరిస్థితుల్ని మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంకో వైపున కాంటాజియస్ డిసీజ్‌తో బాధపడుతున్న 25 ఏళ్ళ ఫిలిప్పీన్‌కి చెందిన వ్యక్తిని సాల్మియా స్పాలో అరెస్ట్ చేశారు. అలాగే, అరబ్ వలసదారులు ఇద్దర్ని 10 కువైట్ దినార్స్ రెవెన్యూ స్టాంప్స్‌ని సగం ధరకే విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవి ఫేక్ స్టాంప్స్గా గుర్తించారు. ఇదిలా ఉండగా కింగ్ అబ్దుల్ అజీజ్ ఎక్స్‌ప్రెస్ వే పైన ఓ బస్సు ఓవర్‌టర్న్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా బాధపడ్డారు. మరో ఐదుగురు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







