మలయాళంలో మెయిన్ విలన్ గా కాలకేయుడు'

- September 25, 2016 , by Maagulf
మలయాళంలో మెయిన్ విలన్ గా కాలకేయుడు'

'బబాహుబలి' సినిమాలో 'కాలకేయుడు'గా చిత్రమైన గెటప్పుతో, విచిత్రమైన భాషతో ప్రభాకర్ ప్రేక్షకులను మెప్పించాడు. అంతకుముందు విలన్ గ్యాంగ్ లో ఒకడిగా కనిపించే ఆయనకు 'బాహులి' తర్వాత ముఖ్య పాత్రలు పోషించే అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో 'కాలకేయుడు' స్థాయిలో తనకు గుర్తింపు తెచ్చే మరో పాత్ర కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి మలయాళంలో మెయిన్ విలన్ గా చేసే అవకాశం దక్కింది. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించనున్నాడు. ఈ సినిమా హిట్ కొడితే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తన కెరియర్ ఊపందుకోవడం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు ప్రభాకర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com