రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఒకరికి తీవ్రగాయాలు
- September 25, 2016
షార్జా: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోగా, మరో వ్యక్తి తీవ్రగాయాల పాలైన ఘటన దుబాయ్ - షార్జా రోడ్డు మార్గంలో చోటు చేసుకుంది. ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద విషయాన్ని తెలుసుకోగానే పెట్రోల్ వెహికిల్లో పోలీసులు అక్కడికి చేరుకుని, బాధితులకు సహాయం అందించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి, తీవ్ర గాయాల పాలైన వ్యక్తి భారతీయ వలసదారులుగా గుర్తించారు. గాయపడ్డ వ్యక్తి అల్ కువైటీ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









