ఘాజీ చిత్రం ఫిబ్రవరి 24 న విడుదల
- September 26, 2016
బాహుబలి చిత్రం తర్వాత రానా క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిసారి నౌకాదళ యుద్ధం నేపధ్యంలో ఘాజీ అనే చిత్రం తెరకెక్కుతుండగా, ఈ చిత్రంలో రానా ఓ నేవీ అధికారిగా కనిపించనున్నాడు. సంకల్స్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఢిల్లీ డాల్ తాప్సీ రానా సరసన జతకట్టింది. 1971 లో జరిగిన ఇండో -పాక్ యుద్ధ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొంత మంది పాకిస్థాన్ రంగస్థల నటులు కూడా నటించినట్టు సమాచారం. ఘాజీ చిత్రంకు భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వాడడం జరిగిందని, ఇందులోని స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేస్తాయని నిర్మాతలు తెలిపారు. పీవీపీ బ్యానర్ పై తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 24 న విడుదల చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్.హిందీలో కారం జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో పివిపి సంస్థ సమర్పిస్తోంది. రానా మరో వైపు బాహుబలి ది కంక్లూజన్, తేజ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









