'ఏ.పి.ఎన్.ఆర్.టి' కి 86 ఎకరాల భూమి కేటాయించిన ఏ.పి ప్రభుత్వం
- September 27, 2016
వీరపనేనిగూడెం ప్రాంతాన్ని మోడల్ ఇండస్ట్రియల్ క్లస్టర్‌గా తయారుచేసేందుకు APNRT కి 86 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఆ మేరకు పారిశ్రామిక వేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించారని ఏపీఐఐసీ డీజీఎం శరత్‌బాబు చెప్పారు.
శరత్‌బాబు ఆధ్వర్యంలోని పారిశ్రామికవేత్తల బృందం సోమవారం గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని కొండపోరంబోక సర్వే నంబర్ 192/7బీ భూములను సందర్శించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి ఇండస్ట్రిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏవీ రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాజధానిలో పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించగా, వీరపనేనిగూడేన్ని సూచించారని చెప్పారు. ఇక్కడ పారిశ్రామిక వేత్తలు ఒక్కో పరిశ్రమకు రూ.కోటి నుంచి రూ.5కోట్ల వరకూ పెట్టుబడులు పెడతారన్నారు.
డాక్టర్ నన్నపనేని మురళీ మాట్లాడుతూ రాబోయే తరానికి మంచి భవిష్యత్ అందించే లక్ష్యంతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్ పరిశ్రమలు చేస్తున్నట్లు చెప్పారు టెక్నాలజీ ని ఎపికి ట్రాన్స్ ఫర్ చేసేందుకు కృషి చేస్తున్నాము. పారిశ్రామికవేత్త వేణుబాబు మాట్లాడుతూ పవర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న తాము డిప్లొమా, ఐటీఐ వారికి ఉపాధిని అందిస్తామన్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







