'మేకిన్ ఇండియా' పిలుపు పొరుగుదేశాలకు ముప్పుగా మారిందా?
- September 27, 2016
నరేంద్రమోదీ ఇచ్చిన 'మేకిన్ ఇండియా' పిలుపు పొరుగుదేశాలకు ముప్పుగా మారిందా? అవుననే అంటోంది గ్లోబల్ టైమ్స్ పత్రిక. ఇందులోభాగంగా పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన భారత్‌కి బిజినెస్మేన్లు తరలిపోవడం చూస్తుంటే, అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని ఈ పత్రిక ఓ కథనాన్ని రాసుకొచ్చింది. చైనాకు చెందిన ఓ కంపెనీ ఇటీవల భారత్‌లో స్మార్ట్ఫోన్ల తయారీ చేపట్టడాన్ని ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించింది.
భారతలోవున్న మార్కెట్ అవకాశాలను దృష్టిలో పెట్టుకున్న చైనాకు చెందిన మిగతా స్మార్ట్ఫోన్ల కంపెనీలు ఇదేబాట పట్టేందుకు సిద్ధమైనట్టు తెలిపింది. ఇదే గనుక కంటిన్యూ అయితే ఈ సెక్టార్‌పై చైనాలో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ఆధునిక టెక్నాలజీ ద్వారా చైనా కంపెనీలు తమ పోటీ సామర్ధ్యాన్ని నిలబెట్టుకోవాలని, లేకపోతే భారత్ నుంచి చైనా కంపెనీలకు తిప్పలు తప్పవని గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది. భారతలో పెట్టుబడి పెట్టే ముందే.. ఆయా కంపెనీలు అక్కడి కంపెనీల చట్టం, కార్మిక చట్టాలు తెలుసుకుంటే మంచిదంటూ ఓ సలహా ఇచ్చేసింది
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









