భారత్-చైనా ఉగ్రవాదం పై ఉమ్మడి పోరు...
- September 27, 2016
భద్రతా పరమైన ముప్పును ఎదుర్కొనేందుకు సంయుక్తంగా ముందుకెళ్లాలని, ఈ విషయంలో పరస్పరం సహకరించుకోవాలని భారత-చైనా నిర్ణయించాయి. అదేవిధంగా ఉగ్రవాద నిర్మూలనకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈమేరకు మంగళవారం భారత-చైనా అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించాయి. కాగా ఉగ్రవాదంపై రెండు దేశాలు చర్చలు జరపడం ఇదే తొలిసారి. భారత తరఫున సంయుక్త నిఘా విభాగం చైర్మన్ ఆర్.ఎన్.రవి, చైనా నుంచి రాజకీయ, న్యాయవ్యవహారాల సెక్యూరిటీ జనరల్ వాంగ్ యంగ్కింగ్లు ఈ చర్చలలో పాల్గొన్నారు. ఉగ్రవాద నిర్మూలన, భద్రత అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపైనే చర్చలు జరిగాయని అధికారులు తెలిపారు.కాగా జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించాలనే భారత డిమాండ్‌కు విభేదిస్తూ వస్తున్న చైనా మెత్తబడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







