గో యాప్‌తో యూట్యూబ్ కొత్త ప్రయోగం...

- September 27, 2016 , by Maagulf
గో యాప్‌తో యూట్యూబ్ కొత్త ప్రయోగం...

సెర్చ్ ఇంజన్ గూగుల్ ట్రెండ్‌కి అనుగుణంగా మారిపోతోంది. మార్కెట్ ఎక్కడుంటే అదే తమ టేస్ట్ అంటూ తేల్చేసింది. ఇందుకు ఎగ్జాంఫుల్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ప్రొడక్టులు. 18వ ఏటలోకి అడుగుపెట్టిన సందర్భంగా గూగుల్‌.. భారత్‌లో న్యూ ప్రొడక్ట్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. భారతీయుల కోసం గూగుల్‌ స్టేషన్‌ పేరుతో వైఫై ప్లాట్‌ఫాంను, యూట్యూబ్‌ గో పేరుతో ఒక వీడియో యాప్‌ను తీసుకొచ్చింది. దీని ముఖ్యఉద్దేశం 2జీ నెట్‌వర్క్‌ల్లో కూడా వీడియోలను సేవ్ చేసుకొని యూజర్స్ వీక్షించవచ్చు.అలాగే ఈ వీడియోల్ని బ్లూటూత్ ద్వారా ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోవచ్చు. భారత్‌లో ఇంటర్నెట్‌ యూజర్స్ పెరగడంతో వారి అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను రెడీ చేస్తున్నట్లు వెల్లడించింది.భారత్‌లోని 15 సిటీల్లో సేకరించిన అభిప్రాయాల ద్వారా ఈ యాప్‌ను డెవలప్ చేశామని ఆ కంపెనీ తెలిపింది. పూర్తిస్థాయిలో పరీక్షించిన అనంతరం ఈ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. గూగుల్ ఇప్పటికే రైల్‌టెల్‌తో కలసి దేశంలోని 52 రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సర్వీలను అందిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా వీటి సంఖ్యను 100కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com